తమ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, వారెవరన్నది గుర్తించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు  ప్రలోభ పెట్టారని, డబ్బుకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బాబు సిద్ధహస్తుడని, గతంలోనూ ఇలాంటి ఉదంతాలు చూశామని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, ప్రజలు తమవెంటే ఉంటారని… ఇప్పటికీ వై నాట్ 175 నినాదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై తగిన సమయంలో చర్యలు ఉంటాయని ప్రకటించారు. బాబు నిజంగా గ్రాడ్యుయేట్, ఈ ఎమ్మెల్సీ ఫలితాలు చూసి ధీమాగా ఉంటే మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేస్తామని ప్రకటించగలరా అని ప్రశ్నించారు.

టిడిపికి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో నలుగురు దూరమయ్యారని, కేవలం 19 మందే ఉన్నప్పుడు 23 ఓట్లు ఎలా తెచ్చుకోగాలిగారని… దీన్నిబట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తేటతెల్లమవుతోందని అన్నారు. సంఖ్యా బలం ఉంది కాబట్టే పోటీ చేశామన్నారు. గతంలో 23 మంది టిడిపిలోకి వెళుతున్నప్పుడు కూడా జగన్ ఏమాత్రం చలించలేదని, ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేల గురించి అదే విధానంతో ఉంటామని చెప్పారు.

Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *