Saturday, March 14, 2026
Homeసినిమాసోషియో ఫాంటసీ టచ్ తో బెల్లంకొండ థ్రిల్లర్ మూవీ!

సోషియో ఫాంటసీ టచ్ తో బెల్లంకొండ థ్రిల్లర్ మూవీ!

ఇప్పుడు ఆధునిక సాంకేతి పరిజ్ఞానం అందుబాటులకి వచ్చింది. ఒకప్పుడు తెరపై అద్భుతాలను చూపించాలనుకుంటే, అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వలన, రాజీపడటంగానీ .. ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టడంగాని చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కంటెంట్ సరైనదై ఉండాలేగానీ, అనుకున్నది అనుకున్నట్టుగా తెరపై ఆవిష్కరించవచ్చు. అందువల్లనే ఇప్పుడు గ్రాఫిక్స్ తో కూడిన కథలకు గిరాకీ పెరిగిపోతోంది.

‘కార్తికేయ 2’ .. ‘అఖండ’ .. ‘ హను మాన్’ వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ .. ప్రభాస్ చేస్తున్న ‘కల్కి’ .. మంచు విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించినవి కావడం గమనించవలసిన విషయం. ఆ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇదే తరహా కథను ఎంచుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆయన సైన్స్ ఫిక్షన్ .. సోషియో ఫాంటసీ టచ్ తో సాగే థ్రిల్లర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి లుథీర్ బైరెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. 50 కోట్లతో ఈ సినిమా రూపొందనుంది. నిజానికి బెల్లంకొండకి ఉన్న మార్కెట్ కి ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. కానీ కంటెంట్ పై నమ్మకంతో నిర్మాతలు ఈ మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular