Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్IPL: చివరి బంతికి హైదరాబాద్ ఉత్కంఠ విజయం

IPL: చివరి బంతికి హైదరాబాద్ ఉత్కంఠ విజయం

రెండు ఓటములతో వరుస డీలా పడ్డ అభిమానులను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ అద్భుత విజయంతో అలరించింది. సొంత గడ్డ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో… పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో  ఒక్క పరుగు తేడాతో చివరి బంతికి గెలుపు సొంతం చేసుకొని క్రీడాభిభిమానులకు ఓ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ఆస్వాదించే అవకాశం కలిగించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు రైజర్స్ బౌలర్ మొదటి భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు పడగొట్టి దెబ్బ దీశాడు.  మంచి ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శామ్సన్ లను డకౌట్ గా వెనక్కు పంపాడు.  కానీ ఈ ఆనందం హైదరాబాద్ కు ఎక్కువసేపు నిలవలేదు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- రియాన్ పరాగ్ లు రెండో వికెట్ కు 134 పరుగులు చేసి జట్టును విజయపథంలో తీసుకెళ్లారు. జైస్వాల్ 40 బంతుల్లో 7 ఫోర్లు; 2 సిక్సర్లతో 67; రియాన్ పరాగ్  49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యారు.

ఆ తర్వాత సిమ్రాన్ హెట్ మెయిర్- రోమన్ పావెల్ లు దూకుడుగా ఆడి జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్ళారు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో భువనేశ్వర్ కుమార్ వేసిన ఓ చక్కటి బంతికి పావెల్ ఎల్పీగా అవుట్ కావడంతో విజయం హైదరాబాదును వరించింది.  పావెల్ 27; హెట్మెయిర్ 13 రన్స్ చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఆటను నెమ్మదిగా ప్రారంభించింది. జట్టు స్కోరు 25 వద్ద అభిషేక్ శర్మ(12) ఔటయ్యాడు. గత మ్యాచ్ లో విఫలమైన అన్మోల్ ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్ లోను కేవలం ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్- నితీష్ కుమార్ రెడ్డిలు మూడో వికెట్ కు 96 పరుగులు చేసి పరువు నిలిపారు. హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 స్కోరు చేసి అవుట్ కాగా….
నితీష్ కుమార్ రెడ్డి 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76;  హెన్రిచ్ క్లాసేన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 42 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2; సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్  భువికి  ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్