Saturday, January 18, 2025
Homeసినిమాదశావతారాల నేపథ్యంలో బెల్లంకొండ కథ!

దశావతారాల నేపథ్యంలో బెల్లంకొండ కథ!

‘కార్తికేయ’ నుంచి ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కథ దైవంతో ముడిపడి సాగడం మొదలైంది. ఇక అప్పటి నుంచి చాలామంది మేకర్స్ ఈ తరహా కంటెంట్ ను క్రియేట్ చేయడం పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ‘అఖండ’ విజయం ఈ జోనర్ పట్ల అంతా మరింత ఆసక్తి చూపించేలా చేసింది. కొంతమంది ఫాంటసీ టచ్ ఇస్తే, మరికొంతమంది సెమీ ఫాంటసీ టచ్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి కంటెంట్ నే సెట్ చేసుకున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. తన మొదటి సినిమా నుంచే దానిని డెవలప్ చేసుకుంటూ వచ్చాడయన. అయితే ఈ మధ్యలో ఆయన బాలీవుడ్ పై దృష్టి పెట్టేసి అటుగా వెళ్లడం వలన, తెలుగు ఆడియన్స్ తో కొంత గ్యాప్ వచ్చేసింది. దానిని భర్తీ చేయడానికి అన్నట్టుగా ఆయన వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అలా ‘టైసన్ నాయుడు’ .. ‘కిష్కిందపురి’ సినిమాల పనిలో బిజీగా ఉన్నాడు.

ఆ తరువాత సినిమాను ఆయన లుథీర్ బైరెడ్డి దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. మహేశ్ – చందూ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో  చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకి ‘హైందవ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ కథ దశావతారాల నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. ఒక ప్రాచీనమైన ఆలయంలో దశావతార మూర్తులు ఉంటాయి. ఆ దేవాలయానికీ .. హీరోకి సంబంధం ఉంటుంది. అదేమిటి? అనేదే కథ. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్తా మీనన్ కనిపించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్