Saturday, January 18, 2025
Homeసినిమామల్టీ స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ!

మల్టీ స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ!

బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది. తన మొదటి సినిమా నుంచి దానిని కాపాడుకుంటూ వస్తున్నాడాయన. అయితే ఆ మధ్య ‘ఛత్రపతి’ రీమేక్ అంటూ బాలీవుడ్ వైపు వెళ్లడం వలన, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు. ఆడియన్స్ వైపు నుంచి వచ్చిన గ్యాప్ ను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసుకునే పనిలో పడ్డాడు. అందువల్లనే వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు.

అలా ఆయన నుంచి రావడానికి టైసన్ నాయుడు .. కిష్కిందపురి .. హైందవ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించినవే. ఇక రీసెంటుగా అనిల్ విశ్వనాథ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఈ దర్శకుడు మంచి గుర్తింపు హెచ్చుకున్నాడు. ఈ సినిమాకి ‘ఆట మొదలైంది’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో మరో మల్టీ స్టారర్ కి కూడా బెల్లంకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నారా రోహిత్ .. మంచు మనోజ్ కీలకమైన పాత్రలను పోషించనున్నారు. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నాడని టాక్. బెల్లంకొండ పాత్రతో పాటు, మిగతా రెండు పాత్రలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందట. అందువలన ఇది మల్టీ స్టారర్ గానే చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్