Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Bellamkonda Srinivas Stuvartpuram Donga First Look Released :

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా కె.ఎస్‌.ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ చిత్రాల‌తో, వైర్సటైల్ పాత్ర‌ల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేమైక ఇమేజ్‌ను సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అయన తండ్రి బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.

ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే పొడ‌వుగా వెన‌క్కి దువ్విన జుట్టు, గుబురు గ‌డ్డంతో, రెండు తుపాకుల‌ను ప‌ట్టుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సీరియస్‌గా చూస్తున్న లుక్‌తో ఉండ‌టాన్ని గ‌మ‌నించవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీనివాస్ హీరోగా చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన సినిమా ఇది. హీరోయిజంతో పాటు ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ ఉన్న స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో పేరు మోసిన గ‌జ‌దొంగ నాగేశ్వ‌ర‌రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని స్టూవ‌ర్టుపురం దొంగ‌ రూపొందిస్తున్నారు.

అప్ప‌ట్లో నాగేశ్వ‌ర‌రావు ఎంతో చాక‌చ‌క్యంగా దొంగ‌త‌నాలు చేయ‌డ‌మే కాదు.. పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకునేవారు. అంతే కాకుండా ఉన్న‌వాడిని దోచి లేనివాడికి పంచేవారు. దాంతో ఆయ‌న్ని అంద‌రూ రాబిన్ హుడ్ అని, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అని పిలిచేవారు. ఓ పీరియాడిక్ నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి త‌న లుక్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నారు. అన్నీ ఎలిమెంట్స్‌ను స‌మ‌పాళ్ల‌లో మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com