కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ కు పిలిచి అవమానించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోడీ నేడు 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము చెప్పేది వినడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నట్లు కనబడలేదని, వాక్సిన్ విషయంలో కూడా తమ అభిప్రాయాలు తీసుకోలేదని, బిజెపి సిఎంకు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు. మోడీ ఈ సమావేశానికి ఇలా వచ్చి అలా వెళ్ళారని, అధికారుల మాటే గాని ముఖ్యమంత్రుల మాట వినరా అంటూ ప్రశ్నించారు.