Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్IPL: రాజస్థాన్ పై బెంగుళూరు విజయం

IPL: రాజస్థాన్ పై బెంగుళూరు విజయం

రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 7 పరుగులతో గెలుపొందింది. బెంగుళూరు ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ స్కోరు బోర్డు తెరవక ముందే స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది, 12 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ (2) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో డూప్లెసిస్- గ్లెన్ మాక్స్ వెల్ లు మూడో వికెట్ కు 127 పరుగులు జోడించారు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు, 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు, డూప్లెసిస్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 రన్స్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో కార్తీక్ 16 స్కోరు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాట్స్ మెన్ రనౌట్ కావడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో రెండు; రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ – దేవదత్ పడిక్కల్ రెండో వికెట్ కు 98 పరుగులు చేశారు. జైస్వాల్-47; పడిక్కల్-52; సంజూ శామ్సన్-22 రన్స్ చేసి ఔటయ్యారు. హార్డ్ హిట్టర్ హెట్మెయిర్ 4 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. ధృవ్ జురెల్ 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బెంగుళూరు బౌలర్లు డేవిడ్ విల్లె, సిరాజ్, హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరి రాజస్థాన్ విజయాన్ని అడ్డుకున్నారు. దీనితో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

హర్షల్ పటేల్ 3; సిరాజ్, విల్లె చెరో వికెట్ పడగొట్టారు. గ్లెన్ మాక్స్ వెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్