Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్WPL: ఓటమి 'బెంగ'ళూరు: ఢిల్లీ చేతిలో ఓటమి

WPL: ఓటమి ‘బెంగ’ళూరు: ఢిల్లీ చేతిలో ఓటమి

విమెన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ లో బెంగుళూరుకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది.  నేటి మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్లతో విజయం సాధించింది. ఓ దశలో బెంగుళూరుకు గెలుపు అవకాశం కనిపించినా ఢిల్లీ ప్లేయర్లు మారిజానే కాప్- జెస్ జోనాస్సేన్ లు బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని  ఐదో వికెట్ కు అజేయంగా 45 పరుగులు చేసి విజయం అందించారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా రేణుకా వేసిన మూడో బంతిని సిక్సర్ గా మలిచిన జెస్ జోనాస్సేన్ విజయం ఖరారు చేసింది. కాప్ 3౦; జోనాస్సేన్ 29 పరుగులు చేశారు.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు కెప్టెన్ స్మృతి మందానా (8) మరోసారి విఫలమైంది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ 21 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరగ్గా, ఎలీస్ పెర్రీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 67; రిచా ఘోష్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ చేసి రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు; తారా నోరిస్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా ఒక్క పరుగు వద్ద ఢిల్లీ ఓపెనర్ ఓపెనర్ షఫాలీ వర్మ డకౌట్ గా వెనుదిరిగింది. ఎలీస్ క్యాప్సీ-38; కెప్టెన్ మెగ్ లన్నింగ్ 15; జేమైమా రోడ్రిగ్యూస్-32 పరుగులు చేసి ఔటయ్యారు.

జెస్ జోనస్సేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్