Sunday, January 19, 2025
HomeTrending Newsసెప్టెంబర్ నెలాఖరుకు కార్బోవ్యాక్స్

సెప్టెంబర్ నెలాఖరుకు కార్బోవ్యాక్స్

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ‘బయోలాజికల్ ఇవాన్స్’(బిఈ) మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయతో భేటి అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్నకోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బోవ్యాక్స్’ పురోగతిని వివరించారు. బిఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

కార్బోవ్యాక్స్ ను ఈ సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందుబాటులో తీసుకువచ్చేలా బిఈ ప్రయత్నిస్తోంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే మొదలైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ నిల్వల కోసం మూడు నెలల క్రితమే తన పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది.

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపుతోంది. అయితే మన దేశ జనాబాకు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో మరిన్ని కొత్త వ్యాక్సిన్లను దిగుమతి చేసుకొని వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ముందుకొచ్చిన బిఈ కంపెనీకి కేంద్రం తగిన ప్రోత్సాహం అందిస్తోంది.

ఈ నెలాఖరుకు బిఈ కంపెనీ తమ వ్యాక్సిన్ ‘ఎమర్జెన్సీ యూజ్ లైసెన్స్’ కోసం దరఖాస్తు చేయనుంది. డిసెంబర్ నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వానికి  ౩౦ కోట్ల డోసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్