Tuesday, June 16, 2026
Homeసినిమా'భగవంత్ కేసరి'.. ఎక్కడ..?

‘భగవంత్ కేసరి’.. ఎక్కడ..?

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఆమధ్య బాలయ్య పుట్టినరోజుకు రిలీజ్ చేసిన భగవంత్ కేసరి టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో భగవంత్ కేసరి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకీ ఈ మూవీ అప్ డేట్ ఏంటంటే.. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. భాను మాస్టర్‌ పర్యవేక్షణలో బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల ప్రధాన తారాగణం పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అందరు ప్రధాన నటీనటులు నటించిన ఈ పాటను చూడటం కన్నుల పండువగా ఉంటుందట. ఈ పాటతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ తో యాక్షన్ పార్ట్ ను కలిగి ఉందట. బాలకృష్ణ మునుపెన్నడూ చేయని క్యారెక్టర్‌లో నటిస్తున్నారని.. తెలంగాణ యాసలో తన డైలాగ్‌లతో ఆకట్టుకుంటారని… ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో ఈ భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 19న భగవంత్ కేసరి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular