Sunday, November 24, 2024
HomeTrending Newsసీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన పంజాబ్ సీఎం

సీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన పంజాబ్ సీఎం

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ఈ రోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో దేశంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌లు కార్య‌క్ర‌మాల నిమిత్తం ఇవాళ మ‌ధ్యాహ్నం సీఎం భ‌గ‌వంత్ మాన్ హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ప్రగతి భవన్‌కు చేరుకున్న ఆయనకు కేసీఆర్ , మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌ మార్చిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతగా ఉన్న భగవంత్ మాన్‌తో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా.. పంజాబ్‌లో పెట్టుబడుల కోసం పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించేందుకు భగవంత్ మాన్ చెన్నై, హైదరాబాద్‌లలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇందుకోసం ఆయన ఆదివారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. సోమవారం రోజున చెన్నైలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై భగవంత్ మాన్.. ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు మరియు జాయింట్ వెంచర్‌ల గురించి చర్చించారు. ఇక, మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న భగవంత్ మాన్.. పరిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. పంజాబ్ ప్రభుత్వం ఫిబ్రవరి 23, 24 తేదీల్లో మొహాలీలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలకు భగవంత్ మాన్ ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.

24న పంజాబ్‌ స్పీకర్‌ రాక

పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్