Saturday, January 18, 2025
Homeసినిమాశ్రీవిష్ణు ‘భళా తందనాన’ మే 6న విడుదల

శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మే 6న విడుదల

Bhala: ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.

Also Read : నాని రిలీజ్ చేసిన శ్రీ విష్ణు ‘భళా తందనాన’ టీజర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్