Friday, March 29, 2024
HomeTrending Newsటిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

టిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

Bharat Rashtra Samithi : తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించబ‌డింది. ద‌స‌రా శుభఘ‌డియ‌ల్లో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది. దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. టిఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాలు సేకరించారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఆయ‌న అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కూడా ఇవాళ టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్