కరోనాపై కెసిఆర్ ప్రగల్భాలు: భట్టి

తెలంగాణను కాపాడేందుకు సీఎం కెసిఆర్, మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. దొంగలు పడ్డ అరునెలలకు కుక్కలు మొరిగినట్లు టీఆరెస్ ప్రభుత్వం, నేతలు ఏడాదికి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతోందని మేము చెప్పినా సీఎం కెసిఆర్ పట్టించుకోలేదని భట్టి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేము చెప్పినా కేసీఆర్ నిద్రలేవలేదన్నారు. తెలంగాణ వచ్చాక కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి కూడా తెరాస సర్కార్  నీళ్లు ఇవ్వలేదన్నారు.

కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని భట్టి విమర్శించారు. రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ యాజమాన్యం  28లక్షల రూపాయల బిల్లు ఎలా వసూళ్లు చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలని  కేసీఆర్ నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం, అమలులో మాత్రం ఉండవని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *