When: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. పవర్ స్టార్ అభిమానులు మరోసారి ఈ కాంబినేషన్లో మూవీ వస్తే.. చూడాలనుకున్నారు. అభిమానుల కోరుకున్నట్టుగానే.. ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ అని టైటిల్ అనౌన్స్ చేయడం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది.
అయితే.. ఈ అనౌన్స్ మెంట్ వచ్చి నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. హరీష్ శంకర్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందనే చెబుతున్నారు. వేరే ప్రాజెక్ట్ కి వెళ్లకుండా ఈ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే వెయిట్ చేస్తున్నారు. తాజా అప్ డేట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఈ సినిమానికి డేట్స్ ఇచ్చారట. ఆగష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పారట.
దీంతో హరీష్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో స్పీడు పెంచారని సమాచారం. ఆగష్టు నెలాఖరుకు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ లెక్చరర్ గా నటించనున్నారని తెలిసింది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ లో కదలిక వచ్చింది. మరి.. పవర్ స్టార్, హరీష్ శంకర్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Also Read : బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హరీష్ శంకర్?