Saturday, April 20, 2024
Homeసినిమాబాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హ‌రీష్ శంక‌ర్?

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హ‌రీష్ శంక‌ర్?

Bollywood Harish: ‘గ‌బ్బ‌ర్ సింగ్’ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాని ఆల్రెడీ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. అయితే.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అవుతుంది. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉంటే… హ‌రీష్ శంక‌ర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చిన సినిమాలలో ‘డీజే దువ్వాడ జగన్నాథం’ ఒక‌టి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ కి జంట‌గా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించింది. ఇప్పుడు డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. హిందీలో కూడా దిల్ రాజే నిర్మించ‌నున్నార‌ని.. ఈ సినిమాతోనే హ‌రీష్ శంక‌ర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో న‌టించ‌నున్న‌ట్టు టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్