పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే, సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ భారీ చిత్రం సంక్రాంతికి రావడం ఖాయం అని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ ప్రకటించింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారని.. ఈ టీజర్ ను డిసెంబర్ 15వ తారీఖున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ. టీజర్ లో కూడా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా డిసెంబర్ 15న టీజర్ రిలీజ్ చేస్తే… ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read : పవన్ కు పాట రాసిన త్రివిక్రమ్