Friday, September 27, 2024
Homeసినిమాభీమ్లా నాయ‌క్ హిందీ రిలీజ్ వాయిదా

భీమ్లా నాయ‌క్ హిందీ రిలీజ్ వాయిదా

Hindi Bheemla postponed:  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భీమ్లా నాయ‌క్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా భీమ్లా నాయ‌క్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో థియేట‌ర్లో హౌస్ ఫుల్ బోర్డుల‌తో… హిట్ టాక్ తో భీమ్లా నాయ‌క్ స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకెళుతున్నాడు.

ఇదిలా ఉంటే.. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు.. హిందీలో కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. B4U మోషన్ పిక్చర్స్ ఈ చిత్రం హిందీ హక్కులను సొంతం చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా నిర్మాతలు భీమ్లా నాయక్ హిందీ విడుదలను ఒక వారం వాయిదా వేశారు. భీమ్లా నాయక్ హిందీ వెర్షెన్ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించి, అక్కడ కూడా విడుదల చేయనున్నారు మేకర్స్.  హిందీలో ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయాలని భావిస్తున్నారని స‌మాచారం.

Also Read : ఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్