Friday, March 29, 2024
HomeTrending News70 దేశాలకు తెలంగాణ విత్తనాలు

70 దేశాలకు తెలంగాణ విత్తనాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ప్రారంభించుకోవటం సంతోషకరమని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలని శాస్త్రవేత్తలకు పిలుపు ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని, వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికం అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ రోజు తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రం ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్.ఎ.ఓ వెల్లడించిందని, హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్ కల్పించారని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి చేరుకున్నామని, విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నామన్నారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోందని, కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్ ను నింపిన ఘనత కేసీఆర్ డని కొనియాడారు. కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో భూములు సాగవుతున్నాయన్నారు.

పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నామని, వరి దిగుబడిలో పంజాబ్ ను తలదన్నినమని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తనరంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నదని, ప్రపంచంలో 70 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని మంత్రి వెల్లడించారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్