Saturday, January 18, 2025
Homeసినిమా‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తి

‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తి

Bheemla shoot wrapped: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తోన్నభారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి ఇందులో మ‌రో హీరో. ఆయ‌న డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. శివరాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వరి 25న విడుద‌ల సినిమా చేస్తున్నారు. దీంతో మేక‌ర్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలపై దృష్టిపెట్టారు.

మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు ఓ పాట కూడా రాయ‌డం విశేషం. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన భీమ్లా నాయ‌క్ అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది.

Also Read : చివరికి బాబాయ్ కీ అబ్బాయ్ కి పోటీ తప్పలేదే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్