చివరికి బాబాయ్ కీ అబ్బాయ్ కి పోటీ తప్పలేదే!

Bheemla Nayak-Ghani: పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. అయితే ఆయన తాజా చిత్రమైన ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా పడటం, అప్పటికీ కుదరకపోతే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ మరో డేట్ ఇవ్వడం వాళ్లని చాలా నిరాశపరిచింది. కానీ ఇప్పుడు వాళ్లలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ మేకర్స్ పాత డేట్ నే ఖరారు చేశారు.

ఈ నెల 25వ తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా స్పష్టం చేస్తూ, ఈ రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను వదిలారు. కరోనా ప్రభావం .. పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో నెలకొన్న పరిస్థితుల వలన ఏప్రిల్ కి వెళదామనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే ముందుగానే పరిస్థితులు చక్కబడటంతో, ముందుగా అనుకున్న రోజుకే ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నారు.

నిజానికి ఈ నెలలో ‘ఖిలాడి’ థియేటర్లకు వచ్చేవరకూ సందడి లేదు. ఈ నెల 18న ‘సన్ ఆఫ్ ఇండియా’ మాత్రమే కాస్త పెద్ద సినిమాగా కనిపిస్తోంది. 25వ తేదీన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ .. ‘గని’ .. ‘సెబాస్టియన్’ వంటి సినిమాలు మాత్రమే విడుదలకు రెడీగా వున్నాయి. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఒకే రోజున బాబాయ్ .. అబ్బాయ్ పోటీపడుతున్నారన్న మాట.

Also Read 25నే వ‌చ్చేస్తున్న భీమ్లా నాయ‌క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *