Sunday, January 19, 2025
Homeసినిమాభీమ్లా నాయక్ ఫెస్టివల్ పోస్టర్

భీమ్లా నాయక్ ఫెస్టివల్ పోస్టర్

Festival gift: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. దీంతో భీమ్లా నాయ‌క్ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింద‌ని చెప్పచ్చు.

ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో భారీ అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. సంక్రాంతికి వ‌స్తుంది అనుకున్న భీమ్లా నాయ‌క్ మూవీని ఫిబ్రవ‌రి 25కి వాయిదా వేయ‌డం జరిగింది. అయితే.. ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మంచి అప్ డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు.

తాజాగా నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా నాయక్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో పవన్, దగ్గుబాటి ఇద్దరూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. పవన్ చేసిలో గొడ్డలితో, రానా నోట్లో సిగరెట్ వెలిగించి అంతే మాస్ లుక్ లో ఉన్నారు.

Also Read : ఆచార్య విడుదల వాయిదా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్