Saturday, July 27, 2024
HomeTrending Newsఆసియాలో కొత్త కూటమి

ఆసియాలో కొత్త కూటమి

అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త కూటములు రూపుదిద్దుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల తర్వాత పాకిస్తాన్, చైనాల మధ్య స్నేహం పెరిగింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన, కోవిడ్ అనంతర పరిస్థితులు పాక్ చైనా ల మధ్య స్నేహాన్ని దృడం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి పాకిస్తాన్ దన్నుగా ఉంటోందని అమెరికా తో సహా అనేక దేశాలు ఇస్లామాబాద్ తో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. కరోనా వైరస్ చైనా పుణ్యమే అని ప్రపంచ దేశాలు బీజింగ్ తో దూరం పాటిస్తున్నాయి. దీనికి తోడు టిబెట్, తైవాన్, వుయ్ఘుర్ ముస్లీంల అణచివేత హాంకాంగ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు నిరాకరించటం చైనా ప్రతిష్టను దిగజార్చాయి.

చైనా, పాకిస్తాన్ లకు రష్యా మొదటి నుంచి మద్దతుగా ఉంటోంది. తాజాగా ఈ కూటమిలో టర్కీ చేరింది. ఇప్పుడు టర్కీ, చైనా, పాకిస్తాన్ త్రయం పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. సైప్రస్ వ్యవహారంలో ఎప్పటి నుంచో టర్కీ, గ్రీక్ దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. సైప్రస్ దేశం రెండు దేశాలుగా విడిపోయి ఒకటి గ్రీసు అధీనంలో మరొకటి టర్కీ అధీనంలో ఉంది. అయితే మొత్తం సైప్రస్ తనదే అని టర్కీ వాదిస్తోంది. దీనిపై మెజారిటి ప్రపంచ దేశాలు గ్రీసుకు మద్దతు ఇవ్వగా ఏవో కొన్ని దేశాలు మాత్రం టర్కీని సమర్ధించాయి.

సైప్రస్ విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ మద్దతు టర్కీకి కొత్త బలాన్ని ఇచ్చినట్టైంది. టర్కీ దేశానికి ఇప్పటికే చైనా వెన్నుదన్నుగా ఉండగా తాజాగా ఇస్లామాబాద్ చేరటంతో టర్కీ సంబరపడిపోతోంది. ఇప్పుడు మూడు దేశాలు కలిసి మిస్సైల్ వ్యవస్థలో పరస్పరం సహకరించుకొని అణు పరిశోధనల్లో ఇచ్చిపుచ్చుకోవాలని అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ మూడు దేశాలు కలిస్తే ఆఫ్ఘనిస్తాన్ లో మతోన్మాదుల అరాచకాలు మరింత పెరుగుతాయని, తాలిబాన్ ల పాలన కూడా సుస్థిరం కావటం కష్టమని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్