Tuesday, June 16, 2026
Homeసినిమా'భోళా శంకర్' కొత్త పాట అదిరిపోయింది

‘భోళా శంకర్’ కొత్త పాట అదిరిపోయింది

చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ కనిపించనుంది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు‌. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేత భోళా శంకర్ సినిమాలోని పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ముందుగా కన్ఫర్మ్ చేశారు.మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మహతి స్వరసాగర్, రేవంత్ ఆలపించారు.

కాగా, ‘భోళా మేనియా’ లిరికల్ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేయడంపై చిరంజీవి స్పందించారు. థాంక్యూ తమ్ముడూ డీఎస్పీ… ఈ పాట డబుల్ కుమ్ముడు ఖాయం అంటూ ట్వీట్ చేశారు.ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తునారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular