‘భోళాశంకర్‌` నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. ఓపెనింగ్‌ అదిరింది.. కానీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ నుంచి ఇక పాటల అప్ డేట్లు రానున్నాయి. చిరంజీవిపై చిత్రీకరించిన ఓ హుషారైన సాంగ్ కు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది.

మెగాస్టార్‌ చిరంజీవి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు. ఆయన ఇప్పుడు ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి ‘వాల్తేర్‌ వీరయ్య’ సినిమాతో రచ్చ చేసిన చిరంజీవి ఇప్పుడు ‘భోళాశంకర్‌’తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు షురూ చేశారు. సినిమా నుంచి తొలి సాంగ్‌ ‘భోళా మానియా’ ని రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా పాట ప్రోమోని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్‌తోనే ఈ ప్రోమో ఉంది.

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఆర్కెస్ట్రయిజేషన్ చూస్తే పక్కా మాస్ బీట్ అని అర్థమవుతోంది. ఈ ప్రోమోలో చిన్న మ్యూజిక్ బిట్ ను మాత్రమే వదిలారు. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను జూన్ 4న విడుదల చేయనున్నారు.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ కాగా… చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *