Tuesday, June 16, 2026
HomeసినిమాBhola Shankar: మహేష్ డేట్ కి వస్తున్న చిరు మూవీ

Bhola Shankar: మహేష్ డేట్ కి వస్తున్న చిరు మూవీ

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరయ్య ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీని చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే… చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

అయితే.. ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఈ డేట్ మారనుందని గత కొన్ని రోజులు నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పుడు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అదీ కూడా మహేష్‌ బాబు సినిమా కోసం లాక్ చేసిన డేట్ ను ప్రకటించడం విశేషం. ఇంతకీ ఎప్పుడంటే.. ఆగష్టు 11న భోళా శంకర్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని బట్టి మహేష్‌ బాబు సినిమా ఆగష్టు 11న రావడం లేదని హింట్ ఇచ్చారు. అన్నా- చెల్లెలు సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఉగాది సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి స్పెషల్ స్టిల్ రిలీజ్ చేశారు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్‌ ఉన్న ఈ స్టిల్ విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే.. వాల్తేరు వీరయ్య సినిమాలో అభిమానులు కోరుకున్నట్టుగా పాటలు, డ్యాన్సులు ఉండడంతో బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుచేత భోళా శంకర్ మూవీలో కూడా ఫ్యాన్స్ కి నచ్చేలా మార్పులు చేర్పులు చేశారట. మొత్తానికి ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధించాలని చిరంజీవి గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి.. భోళా శంకర్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడో..? లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular