Thursday, June 18, 2026
HomeసినిమాBhola Shankar: అనిల్ సుంకర, మెహర్ రమేష్ మధ్య విభేదాలా..?

Bhola Shankar: అనిల్ సుంకర, మెహర్ రమేష్ మధ్య విభేదాలా..?

డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అనిల్ సుంకర ‘ఏజెంట్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అనుకుంటే… 80 కోట్లు దాటేసిందని..వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ సురేందర్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయని టాక్ బలంగా వినిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి అలాంటిది ఏమీ లేదని.. చిన్న చిన్నవి తప్పా.. పెద్దగా గొడవలు లాంటివి ఏమీ లేవని చెప్పారు. ఈ నెల 28న వస్తున్న ఏజెంట్ కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే అనిల్ సుంకర.. మెహర్ రమేష్‌ డైరెక్షన్ లో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తుంటే… కీర్తి సురేష్ సిస్టర్ క్యారెక్టర్లో నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే.. ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగిందట. మెహర్ రమేష్ బిల్లా, శక్తి అంటూ భారీ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాలు బడ్జెట్ కంట్రోల్ తప్పాయి.

ఇప్పుడు భోళా శంకర్ మూవీ కూడా బడ్జెట్ కంట్రోల్ తప్పిందని.. దీంతో మెహర్ రమేష్‌, అనిల్ సుంకర మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకనే ఆయన నిర్మాణ బాధ్యతలను చిరుతో సన్నిహితంగా ఉండే వ్యక్తికి అప్పగించి ఆమధ్య అమెరికా వెళ్లిపోయారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఏజెంట్ రిలీజ్ ఉండడం.. ప్రమోషన్స్ చేయాల్సి వుండడం వలన అనిల్ సుంకర తిరిగి హైదరాబాద్ వచ్చారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అనిల్ సుంకరకు సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్ ఇద్దరూ బడ్జెట్ కంట్రోల్ తప్పించి.. అనుకున్న బడ్జెట్ పెంచేసి టెన్షన్ పెట్టారట. మరి.. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు అనిల్ సుంకరకు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular