Saturday, April 20, 2024
Homeసినిమాఆసక్తిని రేకెత్తిస్తున్న 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' టీజర్

ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ టీజర్

శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మరో సినిమాను ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే… శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు.

ఇది వరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ టీజర్ మొదటి నుండి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో శివ డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. పోలీస్ లకు చుక్కలు చూపిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ టీజర్ లో శివ ని గమనించవచ్చు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేసారు మేకర్స్. ఈ టీజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచుతుంది. ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ… ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో సన్నివేశాల్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్