Sunday, February 23, 2025
HomeTrending Newsగుజరాత్‌ సిఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ సిఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్… భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి గుజరాత్ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు ఇతర కేంద్రమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు  యోగి ఆదిత్యనాథ్, బొమ్మైయ్ తదితరులు హాజరయ్యారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 156 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

Also Read : గుజరాత్ లో కమల వికాసం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్