Saturday, April 20, 2024
Homeసినిమాప్రభాస్ ‘రాధే శ్యామ్’కి బిగ్ బి వాయిస్ ఓవర్

ప్రభాస్ ‘రాధే శ్యామ్’కి బిగ్ బి వాయిస్ ఓవర్

Big B VO: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టిస్తోన్న‌ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 11న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు మ‌రో మ‌రో గొప్ప స‌పోర్ట్ దొరికింది. అది ఎవ‌రంటే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌.
రాధేశ్యామ్ సినిమా నెరేష‌న్ కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అఫిషియ‌ల్ గా తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్‌, హీరోయిన్ పూజా హెగ్డే త‌దిత‌రులు అమితాబ్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్‌’ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌మర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. దాదాపు రెండున్న‌రేళ్ల దాటిన త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పై విడుద‌ల‌వుతున్న ప్ర‌భాస్ చిత్ర‌మిది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా రాధే శ్యామ్ కోసం ఎదురు చూస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్