Friday, March 6, 2026
HomeTrending Newsఓటుకు నోటు చంద్రబాబుకు భారీ ఊరట

ఓటుకు నోటు చంద్రబాబుకు భారీ ఊరట

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి భారీ ఊరట లభించింది. ఈ  కేసును సిబిఐతో విచారణ జరిపించాలని,చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు జస్టిస్ ఎం.ఎన్. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

రాజకీయకక్ష సాధింపులకు కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ పిటిషనర్ ఆళ్ళను జస్టిస్ సుందరేశ్ హెచ్చరించారు. ఈ విషయమై గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular