Saturday, November 23, 2024
HomeTrending Newsప్రధానమంత్రిని కలిసిన బిహారీ నేతలు

ప్రధానమంత్రిని కలిసిన బిహారీ నేతలు

జనాభా గణన కులాల వారిగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిశాయి. కులాల వారిగా జనగణన చేయటం దేశ ప్రయోజనాల దృష్ట్యా శ్రేయస్కరమని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. జనగణన అంశంలో ప్రధానమంత్రికి అన్ని విషయాలు వివరించామని, కేంద్ర ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బీహార్ అసెంబ్లీలో రెండుసార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాన్ని ప్రధానికి వివరించామన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వారిలో బిహార్ సిఎం నితీష్ కుమార్, ఆర్.జే.డి. నేత తేజస్వి యాదవ్, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ నుంచి ముకేష్ సాహ్ని, జనతాదళ్ యు నేత విజయ్ కుమార్ చౌదరి, హిందుస్తాని అవాం మోర్చా నాయకుడు జితన్ రామ్ మంజీ, కాంగ్రెస్ నుంచి అజీత్ శర్మ, బిజెపి నేత, బిహార్ మంత్రి జనక్ రామ్, సిపిఐ ఎంఎల్ నేత మహబూబ్ ఆలం, ఎం ఐ ఎం నుంచి అక్తరుల్ ఇమాం, సిపిఐ నుంచి సూర్యకాంత్ పాశ్వాన్, అజయ్ కుమార్ సిపిఎం నుంచి ఉన్నారు.

జనాభా గణన కులాల వారిగా చేయాలని బీహార్ నేతలు ప్రధానిని కలిసినా దేశావ్యాప్తంగా చేయాలని ఆర్.జే.డి నేత తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్దిదారులకు అందుతాయని, ఆ దిశగా పక్కా ప్రణాలికలకు అవకాశముంటుందని తేజస్వి పేర్కొన్నారు.

కులాల వారిగా జనగణన చేయాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మంజీ చెప్పారు. ఈ దఫా జనగణన కులాల వారిగా జరుగుతుందనే నమ్మకం ఉందన్న అఖిల పక్ష నేతలు, ప్రధానమంత్రితో సమావేశం ఫలప్రదం అయిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్