Sunday, September 8, 2024
Homeసినిమా'బింబిసార 2' నుంచి డైరెక్టర్ అవుట్.?

‘బింబిసార 2’ నుంచి డైరెక్టర్ అవుట్.?

కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘బింబిసార‘. ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ చిత్రం ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తుంటే.. ఇన్నాళ్లకు ఛాన్స్ వచ్చింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ వశిష్ట్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

బింబిసార బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘బింబిసార 2’ వస్తుందని.. ఈ సంవత్సరం ఆగష్టులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే.. బింబిసార పార్ట్ 2 కు డైరెక్టర్ మారారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే.. విషయంలో చిత్రయూనిట్, అలాగే డైరెక్టర్ వశిష్ట్ మధ్య క్రియేటీవ్ డిఫరెన్స్ వచ్చాయని అందుచేత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ముందుగా వశిష్ట్ తన నిర్ణయాన్ని కళ్యాణ్ రామ్ కి చెప్పగా.. ఆయన కూడా ఓకే అని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో వశిష్ట్ వేరే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టినట్లుగా తెలిసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… బింబిసార పార్ట్ 2 డైరెక్టర్ గా అనిల్ పాదూరిని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో అనిల్ పాదూరి రొమాంటిక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆతర్వాత మళ్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బింబిసార పార్ట్ 2 కు డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని అంటున్నారు. మరో వైపు వశిష్ట్ రజినీకాంత్, బాలకృష్ణ, రామ్ చరణ్ లకు కథలు రెడీ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి.. వశిష్ట్ రెండో సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్