Thursday, June 11, 2026
Homeసినిమానెలాఖరుకు పవన్ మూవీ కంప్లీట్ అవుతుందా..?

నెలాఖరుకు పవన్ మూవీ కంప్లీట్ అవుతుందా..?

పవన్ కళ్యాణ్‌ తో సినిమా అంటే.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు ఎండ్ అవుతుందో..? ఎవరికీ తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ కు కూడా తెలియని పరిస్థితి. క్రిష్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎప్పుడో ప్రకటించారు. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. అలాగే సుజిత్ డైరెక్షన్ లో చేయనున్న ‘ఓజీ’ (ఓరిజినల్ గ్యాంగ్ స్టర్) మూవీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. సాయిధరమ్ తో కలిసి చేస్తున్న ‘వినోదయ సీతం’ చిత్రం ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ జెడ్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుందట. పవన్ కళ్యాణ్ ఇంత స్పీడుగా ఏ సినిమా చేయలేదట. ఇది తమిళ సినిమా రీమేక్. దీనికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 15 రోజులుగా చకచకా సాగుతోంది. ఒకటి రెండు రోజులు మినహా అన్ని రోజులు పవన్ షూటింగ్ కు హాజరయ్యారు. దర్శకుడు సముద్రఖని ఉరకలు, పరుగులతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలిసింది.

మూడు సెట్ లు పక్కపక్కనే.. ఆరు కెమెరాలు.. డజను మోనిటర్లు.. ఈ సెట్ లో షాట్ కాగానే ఆ సెట్ లోకి పరుగు.. అక్కడ కాగానే మరో దగ్గర.. పట్టుమని పది నిమషాలు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నారట. ఈ తరహా పద్దతికి పవన్-తేజ్ ఇద్దరూ సహకరిస్తున్నారట. సముద్రఖనికి దాదాపు 1500 ఎపిసోడ్ లు టీవీ సీరియళ్లు తీసిన అనుభవం ఉందట. ఆ అనుభవమే ఇక్కడ పని చేసింది అంటున్నారు. మార్చి నెలాఖరుకు ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అంటున్నారు. జులై లేదా ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular