Monday, June 15, 2026
HomeTrending Newsబ్రెయిలీ లిపిలో కేసిఆర్ జీవిత చరిత్ర

బ్రెయిలీ లిపిలో కేసిఆర్ జీవిత చరిత్ర

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్ లో నేడు మంత్రి వర్యులు కేటీఆర్ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన అంధులతో ఆ పుస్తకాన్ని చదివించుకుని ఆ పుస్తకంలోని విశేషాలను వాసుదేవరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్థి రాజకీయ జీవితం, రాజకీయంలో అనుభవించిన పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన, తెలంగాణలో అమలవుతున్న పథకాలను పుస్తకంలో పొందుపరిచినట్టు వాసుదేవరెడ్డి… మంత్రి కేటీఆర్ కి వివరించారు.
ఈ ఆలోచన అత్యద్భుతమని మంత్రి కేటీఆర్… వాసుదేవ రెడ్డి బృందాన్ని ప్రశంసించారు. ఇక ఈ బ్రెయిలీ పుస్తకాన్ని అంధులు చదివి వినిపిస్తుండగా ఒకసారిగా అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి.

కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడని, వారి గొప్ప చరిత్ర భావి తరాల వారికి తెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అంధులకు తెలిసే విధంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని వాసుదేవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ముద్రించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం అంధ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి, చైర్మన్స్ బాలమల్లు,వేణుగోపాల చారీ, సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సిలు కర్నె ప్రభాకర్,పూల రవీందర్ అందులు అర్జున్, మహేందర్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular