Monday, June 15, 2026
HomeTrending Newsసిఎం కెసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

సిఎం కెసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవింతాంతం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భగవంతుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రార్థించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు.. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సీఎం కేసీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌కు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular