Sunday, June 14, 2026
Homeసినిమా'సత్యభామ'గా రమ్యకృష్ణ

‘సత్యభామ’గా రమ్యకృష్ణ

బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ `బంగార్రాజు` కోసం నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి కలిసి న‌టిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘సత్యభామ’గా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగార్జున, రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో న‌ది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య మనోహరమైన కెమిస్ట్రీని మ‌నం చూడొచ్చు.

హైదరాబాద్ RFCలో షూటింగ్‌ జరుగుతోంది. కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు. ఇది అన్ని వ‌ర్గాల వారిని అల‌రించ‌నుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండ‌గా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular