Thursday, April 25, 2024
HomeTrending Newsబీసీ వ్యతిరేకి బీజేపీ.. చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌

బీసీ వ్యతిరేకి బీజేపీ.. చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌

బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ తమకు ఎదో చేస్తారని దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఎనిమిదేండ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారని, అవన్నీ అడియాశలు అయ్యాయని విమర్శించారు. విగతా వర్గాలతోపాటు బీసీలకు కూడా ఏం చేయలేకపోయారని చెప్పారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు మోదీపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఓబీసీ మంత్రిత్వ శాఖతోపాటు బీసీ జనగణన విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని వెల్లడించారు.

ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఆనాడే పీఎం మన్మోహన్ సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ పట్టించు కోలేదని, ఇపుడు బీజేపీ కూడా బీసీ సమస్యలపై స్పందించడం లేదని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు మేలు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం 300 పైగా గురుకులాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. కేంద్రంలో సీఎం కేసీఆర్ చొరవతో భవిష్యత్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు.

బీజేపీకి ఓబీసీ సెల్ ఉంటుంది కానీ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండదా అని ప్రశ్నించారు. ఈ విషయమై బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడైన ఎంపీ లక్ష్మణ్ ప్రధాని మోదీపై ఒత్తిడి చేయలేరా అని నిలదీశారు. తక్షణమే బీసీ గణన చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ పేరుకే బీసీ.. ఎమ్మెల్సీ సారయ్య
ప్రధాని మోదీ పేరుకే బీసీ అని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం చేసేవన్నీ బీసీ వ్యతిరేకపు పనులేనని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతుంటే.. కేంద్రం మంట గలుపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల సంక్షేమం కోసం అవసరమైతే తెలంగాణ ఉద్యమం లాంటి పోరాటం చేస్తామన్నారు. పూలే ఆలోచనా విధానాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కేసీఆర్ బీసీ అనుకూల విధానాలు కేంద్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్