BJP Alleged That Ysrcp Irregularities In Badvel By Poll With Power :
బద్వేల్ ఉపఎన్నికలో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకంటే దారుణంగా, అత్యుత్సాహానికి పోయి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారా మిలిటరీ బలగాలను పంపినా, వారిని వినియోగించుకోకుండా స్థానిక పోలీసులకే డ్యూటీలు వేసి అక్రమాలను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. అధికార పార్టీ కుట్ర రాజకీయాలతో, ప్రజలను భయబ్రాంతులను చేస్తూ విజయం సాధించాలని చూస్తోందని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు, అక్రమాలతో గెలిచారని, దాన్ని తలపించేలా బద్వేల్ లో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్సీ గోవింద రెడ్డిని పోలీసులే అన్ని పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకు వెళుతున్నారని, బిజెపి నాయకులను, పోలింగ్ ఏజెంట్లను మాత్రం భయపెడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బద్వేల్ లో ప్రజలు ఎక్కడికక్కడ అధికార పార్టీపై తిరగబడుతున్నారని, దీన్నిచూసైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఇలా అక్రమాలతో విజయం సాధించడం కూడా ఓ గెలుపేనా అని సూటిగా ప్రశ్నించారు.
Must Read : యాదాద్రి విమాన గోపురానికి విరాళాల వెల్లువ