Friday, March 29, 2024
HomeTrending Newsయాదాద్రి విమాన గోపురానికి విరాళాల వెల్లువ

యాదాద్రి విమాన గోపురానికి విరాళాల వెల్లువ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించామని, 125 కిలోల బంగారం అవసరమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ కార్యం కోసం అందరూ సంతోషంగా ముందుకు వస్తున్నారని, రూ.65 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు, 3600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామన్నారు. కమిటీ పర్యవేక్షణలో రిజర్వ్ బ్యాంక్ వద్దనే మేలిమి బంగారం కొనుగోలు చేస్తామని సిఎం  చెప్పారు. మొట్ట మొదట స్వామివారికి విమాన గోపురానికి తమ కుటుంబం నుండి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుండి ఎంతో కొంత భాగస్వామ్యం ఉండాలన్నారు. కనీసం రూ.11 చొప్పున విరాళం ఇచ్చినా సంతోషమేనని సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఈ ప్రకటన తర్వాత పలువురు ముందుకు వచ్చి బంగారం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు 32 కేజీల బంగారం విరాళాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి.

మెఘా ఇంజనీరింగ్ 6 కిలోల విరాళం

ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం.ఇ.ఐ.ఎల్) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఎం.ఇ.ఐ.ఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి .. మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని ప్రకటించారు.

సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారం : మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్ దైవ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్న శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయ పున: ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కల్సి స్వర్ణ గోపుర తపడానికి కిలో బంగారం విరాళంగా ఇస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

మరికొందరు దాతలు…!

హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ – 5 కేజీలు
మంత్రి మ‌ల్లారెడ్డి – 2 కేజీలు
ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – 2 కేజీలు
ప్ర‌ణీత్ గ్రూప్ – 2 కేజీలు
జీయ‌ర్ పీఠం – 1 కేజీ
ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ – 1 కేజీ
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కేజీ
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కేజీ
ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు – 1 కేజీ
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కేజీ
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కేజీ
ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ – 1 కేజీ
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కేజీ
జ‌ల‌విహార్ రామ‌రాజు – 1 కేజీ
దామోదర్ రావు – 1 కేజీ
కావేరీ సీడ్స్ భాస్క‌ర్ రావు – 1 కేజీ
క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ – 1 కేజీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్