బీజేపీ మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఎన్నికలకు చెందిన తేదీలను ఇంకా ప్రకటించకముందే.. బీజేపీ తన తొలి జాబితాను రిలీజ్ చేసింది. 90 మంది ఎమ్మెల్యేలు ఉండే చత్తీస్‌ఘడ్ అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక 230 మంది ఎమ్మెల్యేలు ఉండే మధ్యప్రదేశ్ కోసం తొలి లిస్టులో 39 మందిని ఖరారు చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో.. బీజేపీ టికెట్ల విషయంలో ముందుజాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అభ్యర్థుల మధ్య గందరగోళాన్ని తగ్గించేందుకే.. ముందస్తుగా తొలి జాబితాను రిలీజ్ చేసినట్లు భావిస్తున్నారు.