Thursday, March 28, 2024
HomeTrending Newsబీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు

బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు

బీజేపీ నిరుద్యోగ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాలిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు హైదరాబాద్ లో బిజెపి అధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు.  దీక్షకు సంఘీభావం తెలిపిన ఓయూ, కాకతీయ, హోంగార్డ్స్ అసోసియేషన్, విద్యా వలంటీర్ల, ప్రైవేటు ఉద్యోగ సంఘం నాయకులు, సోషల్ ఫోరం, జేఎన్టీయూ విద్యార్థులందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్ కు వణుకు పుట్టింది. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చింది. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చిండు. కోవిడ్ తో ఎందరో మరణిస్తే ఏనాడూ బయటకు రాని సీఎం కేసీఆర్. నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని భయపడి జీవో తెచ్చిండు. ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో వందలమంది యువత బలిదానాలు చేసుకున్నరు. ఎదురొస్తున్న రైలును తాకి ఆత్మహత్య చేసుకున్న సుమన్ ఎవరి కోసం చేసుకుండు? ఉద్యోగాలు రాని.. ఉద్యోగాలే రాని తెలంగాణ దేనికోసమో… ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుంది. ఎందరో మేధావులు ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే…. కేసీఆర్ లాంటి మూర్ఖుడి మోసపు మాటలను ఈ మేధావులు ఎందుకు అంచనా వేయలేకపోయిండ్రు.

మేధావులను కూడా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. ఆరోజే మేధావులు కేసీఆర్ మోసాన్ని పసిగడితే… రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదు… ఉద్యోగాల అవస్తలోచ్చేవి కాదు. సీఎంకు ఉద్యోగాలు, నిరుద్యోగులు, కార్మికులపట్ల ఎందుకింత కక్ష కట్టిండో అర్ధం కావడం లేదు. ఆనాడు తన మాట వినకుండా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమాలు చేశారనే సాకుతో కక్షకట్టి వాళ్లను హింసపెడుతుండు. 7 ఏళ్లుగా గ్రూప్-1 లేదు. మూడేళ్లుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా… ఉన్న ఉద్యోగులను తొలగించిన మూర్ఖుడు సీఎం. 12 వేల మంది విద్యా వలంటీర్లు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 వేల మంది స్కావెంజర్లను తొలగించిండు. అసెంబ్లీలో ఈ సీఎం 1 లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయని ప్రకటించిండు. సీఎం వేసిన బిశ్వాల్ కమిటీ 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నరు.

Also Read : త్వరలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్