తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక… తొలి రోజుల్లోనే బిజెపి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసిందని తెరాస ఆరోపిస్తోంది. జూన్ 2, 2014 తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముందే, మోడీ ప్రభుత్వం తొట్ట తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ కు చెందిన భద్రాచలం ఏడు మండలాలు ఆంధ్రలో కలపాలని తీర్మానించిందని తెలంగాణ మేధావులు గుర్తు చేస్తున్నారు. తీర్మానానికి అనుగుణగా మే 29, 2014 లో నే ఆర్డినెన్సు జారీ చేసింది.
దానికి వ్యతరేకంగా TRS అధ్యక్షుడి హోదా లో (జూన్ ,2న ముఖ్యమంత్రిగా బాధ్యతలు, రాష్ట్ర అవతణ తరువాత తీసుకున్నారు) కెసీఆర్ – రాష్ట్రపతికి ఈ ordinance వల్ల భద్రాచలం ముంపు కు గురి అవుతుందని, ఆదివాసీ లకు నష్టం అని వివరించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఉత్తరం రాయడమే కాకుండా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. కెసీఆర్ పిలుపు మేరకు 2014, మే 29న తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్ణాలు బంద్ పాటించాయి.
తదనంతరం పార్లమెంట్ లో బిల్ ప్రవేశ పెట్టిన రోజు TRS MPలు ఉభయసభలలో బిల్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్ ప్రతిని చింపేశారు. TRS MP లకు మద్దతుగా ఒరిస్సా BJD ఎంపీలు మరియు కొందరు ఛత్తీస్ ఘడ్ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. మోడీ ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్ ప్రవేశ పెట్టగా కాంగ్రెస్ వ్యతిరేకించకపోగా, ఈ బిల్ క్రెడిట్ తీసుకునే విధంగా పార్లమెంట్ లో ఆ పార్టీ నేతలు వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రామ్ రమేష్ తాము పోలవరానికి కట్టు బడి ఉన్నామని చెప్పడం రాజ్యసభ రికార్డ్ లలో ఉంది.
భద్రాచలం ముంపునకు కారణం బీజేపీ అయితే కాంగ్రెస్ దానికి మద్దతు తెలిపిందని చరిత్ర పరిశీలిస్తే తేలిపోతుందని తెరాస ఆరోపిస్తోంది. అప్పుడు జరిగిన అన్యాయాన్ని సవరించుటకు తెలంగాణ పక్షాన ఇప్పుడు TRS అయిదు ఊర్లు అడుగుతోంది. పాండవుల అడిగినట్లు 5 ఉర్లు అడగడం, భద్రాచలం ప్రజా శ్రేయస్సు కోసమనే అంటున్నారు.
Also Read : తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది – కెసిఆర్