Sunday, June 14, 2026
HomeTrending Newsజూబ్లిహిల్స్ కేసు CBI కి అప్పగించాలి - బిజెపి

జూబ్లిహిల్స్ కేసు CBI కి అప్పగించాలి – బిజెపి

తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. అత్యాచారాలు, హత్యలు నిరోధించడంలో… శాంతి భద్రతలను కాపాడటంలో… పరిపాలనా నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారన్నారు. దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రక్షకులై భక్షకులుగా మారారన్నారు. తక్షణమే జూబ్లిహిల్స్ మైనర్ బాలిక కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ సీనియర్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన తరుణ్ చుగ్ జూబ్లిహిల్స్ మైనర్ బాలిక వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. అందులోని ముఖ్యాంశాలు….
తెలంగాణ లో జంగల్ రాజ్ నడుస్తుంది… న్యాయ వ్యవస్థకు స్థానం లేదు.. తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరు. శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయి. జూబ్లిహిల్స్ ఘటన లో కొందరిని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి ఇంత జరుగుతున్న స్పందించడం లేదు. అసమర్థ ప్రభుత్వం. కేసీఆర్ పూర్తా కుటుంబ రాజకీయాల్లో మునిగి పోయారు. ప్రభుత్వం లో చలనం లేదు. తెలంగాణలో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారి పోయారు. కెసిఆర్ ఆఫీస్ కి వెళ్ళకుండా ఫాంహౌజ్ కే పరిమితమైండు. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తో బీజీగా ఉన్నాడు. ఇగ హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి.

• కేసీఆర్ అన్నింటిలో ఫెయిల్ అయిండు. అయినా కేసీఆర్ తన పర్సనాలిటీని దేశవ్యాప్తంగా బిల్డప్ చేసుకోవడానికి సర్కారు ఖజానా నుండి రూ.109 కోట్లు ఖర్చు దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలిచ్చి పేద ప్రజల సొమ్మును దురుపయోగం చేస్తున్నారు. సహకరిస్తున్నపోలీసులకు, నిందితులకు కొమ్ము కాస్తున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని జూబ్లిహిల్స్ కేసును CBI కి అప్పగించాలి. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దోషులెవరో తేలుస్తుంది.

Also Read : తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు – రేణుక చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular