Monday, March 31, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బిజెపిది మత రాజకీయం

బిజెపిది మత రాజకీయం

బిజెపి రాజకీయాలు సాగనివ్వబోమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోందని, టిప్పు సుల్తాన్ విగ్రహంపై బిజెపి నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అయన ఆరోపించారు.  ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి విషయాన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకోవడం హేయమైన చర్యగా అయన అభివర్ణించారు.  బెంగుళూరులో ఉన్న టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును తొలగిస్తూ ఆ రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయించాలని రాచమల్లు బిజెపి నేతలకు సవాల్ విసిరారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని అయన హితవు పలికారు.

ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం నేడు ‘చలో ప్రొద్దుటూరు’కు పిలుపునిచ్చింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట  ధర్నాకు దిగిన బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప ఎయిర్ పోర్టుకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్