Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బీజేపీ నాయకుల చిల్లర మాటలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించ పరుస్తున్నాయి. ఎవడో ఒక పనికిమాలినాడొచ్చి ఫార్మ్ హౌస్ నుంచి లాకొచ్చి జైల్లో వేస్తామన్నాడు. రా.. వచ్చి కేసీఆర్ ను టచ్ చేయి. తెలంగాణ కాదు దేశమే అగ్నిగుండమవుతుంది. కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచి 36 పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించిన తెలంగాణ గాంధీ పైనే మీ ఆవాకులు, చేవాకులా?.కేసీఆర్ అంటే ఏమనుకున్నారు? త్రీ ఫేస్ కరెంట్. ముట్టుకుంటే మాడిమాసి అయి పోతారు.దేశంలోనే బీజేపీ బద్దలైపోతుంది. ఖబడ్దార్” అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఓ సర్కస్ కంపెనీ అని, రోజుకో జోకర్ వచ్చి బ్రోకర్ మాటలు చెప్పుతున్నాడని మండి పడ్డారు. రాష్ట్రంలో గడిచిన పది రోజులుగా బీజేపీ రాజకీయ పార్టీ లా కాకుండా సర్కస్ కంపెనీ లా మారిందని, సంజయ్ సర్కస్ కంపెనీ గా బీజేపీ సర్కస్ కంపెనీ గా షో లు నిర్వహిస్తున్నారని,బాంబే సర్కస్ కంపెనీ అని మేము చిన్నపుడు విన్నామని, దాన్ని మించి బీజేపీ సర్కస్ ఫీట్లు చెడుతున్నదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ సీఎం లు, జాతీయ నాయకులు సర్కస్ కంపెనీ లో ఆర్టిస్టులు జోకర్లుగా మారారన్నారు. బీజేపీ సీఎంలకు సంస్కారం లేదన్నారు. వేరే రాష్ట్రం ముఖ్యమంత్రి పట్ల ఎలా వ్యవహరించాలన్న కనీస మర్యాద కూడా లేని వీళ్ళు ఎలా ముఖ్యమంత్రులు అయ్యారో అర్ధం కావడం లేదన్నారు.
దొడ్డిదారిన గద్దెనెక్కిన మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అడ్డగోలు మాటలతో ముఖ్యమంత్రి పీఠానికే కళ్లంకం తెచ్చారన్నారు. కాంగ్రెసు లో ఉంటూ బీజేపీ కోవర్ట్ గా పని చేసిన నీచమైన వ్యక్తి అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ అని, ఆయన తప్పుడు పోస్టులు భరించలేక ఫేస్ బుక్ ఆయన ఖాతాను కూడా తొలిగించిందని జీవన్ రెడ్డి చెప్పారు. అలాంటి శర్మ సీఎం కేసీఆర్ పట్ల పిచ్చి కూతలు కూసాడని ఆయన మండి పడుతూ ఇదేనా బీజేపీ సంస్కారమని ప్రశ్నించారు. వద్దంటే వినకుండా వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
కరోనా బారిన పడ్డారని ఆయన పేర్కొంటూ ఇప్పటికైనా ఆయన కు తత్వం బోధపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.తెలంగాణ అభివృద్ధి గురించి, ప్రాజెక్టుల గురించి, మహా రాష్ట్ర కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే బతుకు బాగుంటుందను ఆ రాష్ట్ర గ్రామాలు తెలంగాణ లో కలపమన్న విషయం తెలుసు కాబట్టి దేవేందర్ ఫడ్నవీస్ రాలేదన్నారు. దానికి బదులుగా వచ్చిన మురళీధర్ రావు తెలంగాణ ప్రభుత్వం పై,కేసీఆర్ కుటుంబం పై పిచ్చి కూతలు కోసి బీజేపీ సర్కస్ కంపెనీ లో మరో కల్లు తాగిన కోతి నని చాటుకున్నారన్నారు. వార్డు మెంబర్ గా గెలవలేని మురళీధర్ రావు చెప్పే చిల్లర మాటలు ప్రజలు నమ్మరని జీవన్ రెడ్డి అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో మేము కూడా పాల్గొని మీ బండారం బయట పెడతం అని ఆయన
నిప్పులు చెరిగారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు లో జైలు కు పంపుతామంటున్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంటు లో ప్రశ్న అడిగితే కాళేశ్వరం లో అవినీతి జరగలేదని కేంద్రం బదులిచ్చింది. టిక్కెట్లు అమ్ముకున్న మురళీధర్ రావు పై పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. మధ్య ప్రదేశ్ ఇంచార్జీ గా ఉన్న మురళీధర్ రావు ఆ రాష్ట్రానికి కూడా వెళ్లలేడు శివరాజ్ సింగ్ చౌహన్ దొంగ దారిన సీఎం అయ్యారు.అసోం సీఎం హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టుగా ఉండి తర్వాత బీజేపీ లో చేరి సీఎం అయ్యాడు.శర్మ తప్పుడు ప్రచారాలకు గతం లో ఫేస్ బుక్ ఆయన్ను బ్యాన్ చేసింది.అలాంటి దిగుమతి నేతలా సీఎం కేసీఆర్ మీద మాట్లాడేది. బీజేపీ నేతలకు కుళ్లు తప్ప కళ్ళు లేవు. కనుకే తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదు . బీజేపీ నేతలకు ఒంటి నిండా కుళ్లు మాత్రమే ఉంది. మహారాష్జ్త మాజీ సీఎం ఫడ్నవీస్ తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల ప్రజలు నిలదీస్తారని ఆయన మహబూబ్ నగర్ సభ కు మొహం చాటేశారు.
సంక్రాంతి కి గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు తెలంగాణ వచ్చి అడ్డమైన అబద్దాలు చెబుతున్నారు.తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీ లు ఉన్నా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సున్నా.రైల్వే ప్రాజెక్టు ల్లో తెలంగాణ కు అన్యాయం జరుగుతున్నా వారు చోద్యం చూస్తున్నారు.దమ్ముంటే కేసీఆర్ పథకాలను ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ మేనిఫెస్టో లో పెట్టి తెలంగాణ గురించి మాట్లాడండి.
ఉచిత విద్యుత్ ఇచ్చే దమ్ము బీజేపీ కుందా?. ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది.హేమంత్ బిశ్వ శర్మ లాంటి దుర్మార్గుడు కేసీఆర్ లాంటి నేత ను అరెస్టు చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? కేసీఆర్ మూడు ఫేజ్ ల కరెంటు లాంటోడు.. ముట్టుకుంటే బీజేపీ బద్దలు కాక తప్పదు. తెలంగాణ గాంధీ కేసీఆర్ ను అరెస్టు చేయడం బీజేపీ తాత, జేజమ్మ ల తో కూడా కాదు.కర్ణాటక,మహారాష్ట్ర లోని గ్రామాలు కూడా తెలంగాణ లో కలుస్తామంతున్నాయి.జాతీయ రాజకీయాలు కచితంగా మారుతాయి.
సీఎం కేసీఆర్ ఆదేశిస్తే యూపీ లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం.సీఎం కేసీఆర్ కూడా అవసరమైతే యూపీ లో ప్రచారం చేస్తారు.హుజురాబాద్ లో బీజేపీ దగ్గర సుఫారీ తీసుకున్న రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడటమా? .ఓటు కు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనడానికి రేవంత్ రెడ్డి చంద్ర బాబు దగ్గర సుఫారీ తీసుకోలేదా? సుఫారీ లు ,సెటిల్ మెంట్ లు ,దందాలు, బ్లాక్ మెయిల్ లు రేవంత్ కే అలవాటు. రేవంత్ బీజేపీ కి బి టీం.చంద్రబాబు దగ్గర సు ఫారీ తీసుకుని తెలంగాణ ఉద్యమం లో తుపాకీ ఎక్కు పెట్టింది రేవంత్ కాదా?. ఫాథర్ ఆఫ్ సుఫారీ రేవంత్. రేవంత్ తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి పై అర్ టీ ఐ కింద సమాచారం తీసుకుంటే చాలు చర్చ అవసరం లేదు.., అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రోజులు దగ్గర పడ్డాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com