Sunday, June 14, 2026
HomeTrending Newsఅమరావతి కోసం బిజెపి సంకల్ప యాత్ర

అమరావతి కోసం బిజెపి సంకల్ప యాత్ర

అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. అమరావతిని ముందుకు తీసుకు వెళ్ళడమే బిజెపి లక్ష్యమని స్పష్టం చేశారు. సిఎం జగన్ ఇప్పటికైనా అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.  ‘అమరావతిలో మనం- మన అమరావతి పేరు’తో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సంకల్ప యాత్ర చేపట్టింది. ఉండవల్లిలో ఈ యాత్రను సోము వీర్రాజు ప్రారంభించారు. వారంరోజుల పాటు అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఈ యాత్ర సాగనుంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు,  చేస్తున్న పనులపై  బిజెపి ప్రచారం చేయనుంది. ఆగస్టు 4లో  తుళ్ళూరులో ఈ పాదయాత్ర ముగియనుంది.

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అనేక పరిణామాలు సంభవించాయని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి భూములు సేకరించి రాజధాని నిర్మాణం వదిలేశారని ఆరోపించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా వాటితో నిర్మాణం చేపట్టలేదన్నారు. సిఎం జగన్ నాడు ప్రతిపక్ష నేతగా మాట తప్పను, మడమ తిప్పాను అంటూ వాగ్దానం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఘాటుగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular