Sunday, March 15, 2026
HomeTrending Newsబీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేదని నిరసన, సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ రావు, రాజా సింగ్. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్న ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. స‌భ ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో ఒకటవ గేటు వద్ద నల్ల కండువాలు వేసుకొని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Also Read : ఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular