Sunday, February 23, 2025
HomeTrending Newsయుపిలో మరోసారి బిజెపి దే అధికారం - అమిత్ షా

యుపిలో మరోసారి బిజెపి దే అధికారం – అమిత్ షా

Bjp Once Again In Power In Up Amit Shah :

ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా భారీ మెజారిటీతో బిజెపి అధికారంలోకి రాబోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.  నరేంద్రమోడి, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారం చేపడుతుందన్నారు. బులంద్ షహర్ జిల్లా అనుప్ షహర్ లో ఈ రోజు జరిగిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొన్నారు.  బిజెపి పాలనలో ఉత్తరప్రదేశ్లోని మాఫియా జైళ్లలోకి వెళ్ళగా కొందరు రాష్ట్రం విడిచి వెల్లిపోయారని మరికొందరు సమాజవాది పార్టీ అభ్యర్థులుగా వస్తున్నారని అమిత్ షా వ్యంగ్యంగా అఖిలేష్ ను విమర్శించారు.

ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి రావటం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడి బలం మరింత పెరుగుతుందని షా పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంటి మీద దాడులు చేస్తే 250 కోట్ల అక్రమ సంపాదన వెలుగు చూసిందని, ఆ వ్యాపారి అఖిలేష్ కు సన్నిహితుడని షా విమర్శించారు. అందుకే ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే అఖిలేష్ ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్